నమస్కారం! What are you looking for?‎


Sunday 13 September 2020

కోతి మామిడిపండుతొ...



 ఒక పెద్ద అడవి పక్కన చిన్న మామిడితోట ఉండేది. అడవినుండి ఒక కోతి కొబ్బరి చిప్పతో ఆడుకుంటూ మామిడి తోటలోకి వచ్చింది.
బాగా మాగిన మామిడిపండును చూసి చెట్టెక్కింది. కొబ్బరి చిప్పను పక్కన పెట్టి మామిడిపండును కోసుకునే ప్రయత్నం చేసింది.
ఇంతలో మామిడిపండు "ఓయ్! నువ్వెవరు నన్ను కోసేకి, నువ్వేమన్నా ఈ చేట్టు నాటావా?" అని అడిగింది.
దానికి కోతి " నేను ఈచెట్టు నాటలేదు. కానీ, ఎన్నో చెట్లు పెరిగేందుకు కారణమైనాను!" అనింది.
అదివిని మామిడిపండు, సరే "నువ్వేచెట్టుకైనా నీళ్లన్నా పోసావా?" అని అడిగింది.
ఏ చెట్టుకైనా వానదేవుడు ఇచ్చే 
నీటికన్నా ఎక్కువ అవసరమా?" అనింది కోతి.
"సరే అయితే, నేను పెరిగేందుకు ఈ చెట్టుకు ఎప్పుడైనా ఎరువు వేశావా?" అని, మామిడిపండు ప్రశ్నించింది.
ఈ చెట్టునుండి రాలిన ఆకులే, నీకు ఎరువుగా సరిపోతాయి కదా! అని, కోతి అనింది.
"మారైతు ఈ చివరనుంచి ఆచివరకు కంచెవేసి, మమ్మల్ని కాపాడుతున్నాడు" అని చెప్పింది మామిడిపండు.
దానికి కోతి , "ఈ భూమికి మొదలు, చివర ఏదో తెలుసా నీకు?" అని, అడిగింది.
ఇంతలో ఒక రాయివచ్చి కోతి తెచ్చుకున్న కొబ్బరి చిప్పకు తగిలి, కొబ్బరి చిప్ప నేలపడింది.
ఈ రాయి ఎక్కడనుండి వచ్చింది. అని, కోతి తొంగిచూసింది. అప్పుడు దూరంగా ఒక వ్యక్తి చేతిలో ఉండేలుతో తనవైపే పరిగెత్తుతూ రావడం గమనించింది.
వెంటనే కోతి,  మామిడిపండును  పీక్కొని అడవిలోకి వెళ్లిపోయింది.
తరువాత, కోతి ఎవ్వరులేని ప్రదేశానికి పోయి, నిదానంగా మామిడిపండును ఆస్వాదిస్తూ తిని, చివర్లో టెంకను చెట్టు వచ్చేందుకు అనువైన ప్రదేశంలో వేసి వెళ్లిపోయింది.
  
                                _ ALL LIKE MINDED.